కర్ణాటక మాదే : అమిత్ షా ధీమా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 130కి పైగా స్ధానాల్లో విజయం సాధిస్తుందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.సిద్ధరామయ్య సర్కారు ఘోరంగా విఫలమైందని, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది ఆయన ఆరోపించారు. దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు కర్ణాటక రాష్ట్రంలోనే జరిగాయని గుర్తు చేశారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య సర్కార్ ఒక్కటేనని అన్నారు.
సీఎం పోటీచేస్తున్నా రెండు స్థానాల్లో తను ఓడిపోతారని జోస్యం చెప్పారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పాలనా పగ్గాలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం విజయఢంకా మోగిస్తుందన్నారు.తాను హిందూ కాదని చెప్పిన సీఎం సిద్ధరామయ్యకు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తోంది అన్నారు. మే12న ఎన్నికలు మే15న ఫలితాలు వుంటాయని ఎన్నికల సంఘం తెలిపింది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS