ఆకాలవర్షాలు!

క్యుములోనింబస్ మేఘాల కారణంగా రుతుపవనాలు రాకముందే వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ నగరంలో సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దిల్‌సుఖ్‌నగర్చైతన్యపురికొత్తపేట, కర్మన్‌ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. తర్వాత వాతావరణం మేఘాలు కమ్ముకుని, కొన్నిచోట్ల వర్షం పడింది. పలుచోట్ల బలమైన గాలులు వీచాయి. నగరంలో ఇంకా మేఘాలు కమ్ముకున్నాయి.

తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రానున్న నాలుగైదు రోజుల వరకు ఇదే రకమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస‍్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకేరోజు భిన్న వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS