హీరోల అభిమాన దర్శకుడు రాజమౌళి
బాలీవుడ్ కుర్ర హీరోల్లో వరుణ్ ధావన్ ఒకడు.‘ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ‘ మూవీతో హీరోగా పరిచయమైన వరుణ్ .. పలు విజయవంతమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం ‘అక్టోబర్‘ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక కార్యక్రమంలో దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ తాను సౌత్ సినిమాలో నటించాలనుకుంటున్నానని. దర్శకదీరుడు రాజమౌళి మరియు శంకర్ లాంటి దర్శకులతో పని చేయడానికి ఆసక్తి ఉందని అన్నారు. ‘బాహుబలి ‘ సినిమా చూసినప్పటినుండి రాజమౌళికి అభిమానిగా మారిపోయానని.. ఆయన డైరక్షన్ లో నటించే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తా అన్నాడు. తెలుగు ,తమిళ్ సినిమాలు చేయడానికి ఎప్పుడైనా తాను సిద్ధమని చెప్పాడు.