హస్తమా! కమలమా!

దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన కన్నడ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. కన్నడ ఓటరు ఎవరికి పట్టం గట్టారనేది తేలిపోనుంది.ఎగ్జిట్‌పోల్స్‌,ప్రీపోల్ సర్వేలలో చెప్పినట్టు హంగ్‌ అసెంబ్లీ ఏర్పుడుతుందా ? అలాగైతే కింగ్ మేకర్ జేడీఎస్ ఎటువైపు సపోర్ట్ ఇస్తుందో ? లేదా ఊహించని విదంగా బీజేపీ,కాంగ్రెస్ లలో ఒకరు ప్రభుత్వాన్ని సొంతగా ఏర్పాటుచేస్తారా? రాజకీయవిశ్లేషకులకు కూడా అందని ప్రశ్నగా మారింది.

ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 9గంటల కల్లా మొదటి ఫలితం వచ్చే అవకాశముంది. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సెంటర్స్ దగ్గర మూడంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు, కేంద్ర బలగాలను కూడా స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర మోహరించారు. కర్ణాటక అసెంబ్లీలో 224 నియోజకవర్గాలుండగా… ఈ నెల 12న 222 నియోజకవర్గాల్లోనే పోలింగ్ జరిగింది. ఓ జాతీయ పార్టీ అభ్యర్థి మృతి కారణంగా జయనగర్ లో, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాజరాజేశ్వరి నగర్ లో పోలింగ్ నిర్వహించలేదు. రాష్ట్రంలో మొత్తం 72.13శాతం ఓటింగ్ నమోదైంది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS