సౌత్ లో “మహానటి” సంచలనం

మామూలుగానే మనది మేల్ డామినేట్ సొసైటీ దీనికి సినీరంగం ఏమి ఆతీతం కాదు అనేది ఒకప్పటి మాట ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనపడటం లేదనేచెప్పాలి.
ఎందుకంటే ఇంతకు ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటేనే ఒక చిన్న చూపు ఉండేది.ఏదో మొక్కుబడిగా తీసేవాళ్లు,బడ్జెట్ ఎక్కువ పెట్టేవారు కాదు దానికి తోడు ఆశించినంత వసూళ్లు సాదించలేకపోయేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి లేడి ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.శ్రీదేవి,కంగన, అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు నటించిన సినిమాలన్నీ పెద్ద సక్సెస్ ను సాదించాయి.
ఇప్పుడు మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం”మహానటి” ఈ సినిమా సౌతిండియా లో సంచలన సృష్టిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే. ఈ చిత్రం పెద్ద హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ వసూళ్లు సాధిస్తోంది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS