సిద్దూకు మళ్లీ కీలక పోస్ట్

సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాల్లో ఈయనో పవర్ పుల్ పొలిటీషయన్. ఐతే అది అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు. ఒంటిచేత్తో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన సిద్ధూకు రిజల్ట్స్ పెద్ద షాకిచ్చాయి. బీజేపీని అడ్డుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో జేడీఎస్ కు సీఎం పదవి ఇచ్చింది కాంగ్రెస్. జేడీఎస్ లోనే పుట్టిపెరిగి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన సిద్ధరామయ్యకు ఇది మింగుడు పడని పరిణామమే అయినా… హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. తాజాగా ఆయన సేవలను వాడుకోవాలని నిర్ణయించింది అధిష్ఠానం. కేబినెట్ హోదాతో ఓ పదవిని కట్టబెట్టాలని డిసైడైంది. ప్రస్తుతం సిద్ధరామయ్య సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ సమితి అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ పదవిలో ఈయన సేవలన్నీ ప్రభుత్వానికి బయట నుంచే చేయాలి. ఈ పదవికి అధికారికంగా ప్రత్యేక హోదా ఉండదు. దీంతో ప్రభుత్వమే సమన్వయ సమితిని ఏర్పాటు చేసి… దానికి కేబినెట్ హోదాను ఇస్తారని టాక్. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వాన్ని సమన్వయ పరిచేందుకు సోనియాగాంధీని చైర్ పర్సన్ గా నియమించారు. ఈ పదవిలో సోనియానే సూపర్ పవర్. ఇప్పుడు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి సమన్వయ సమితి అధ్యక్షులుగా సిద్ధరామయ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఎంతైనా సిద్ధూ పవరేంటో కాంగ్రెస్ పెద్దలకు మా బాగే తెలుసు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS