శ్రీరెడ్డి కంప్లెయింట్ కి పోలీసుల రియాక్షన్

కొన్ని రోజులుగా సంచలనం రేపిన శ్రీరెడ్డి. పవన్ కల్యాణ్ ఎంట్రీ తర్వాత కాస్త సైలెంటాయింది.పవన్ ఫ్యాన్స్ తనను తిట్టారాని వారిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఓ కంప్లయింట్ ఇచ్చింది. వాళ్ళందరిపై యాక్షన్ తీసుకోవాలని వారు పోస్టుచేసిన వీడియోస్, ఫోటోలు డిలీట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది.
అంతే కాకుండా తానే పోస్ట్ చేసుకున్న కొన్ని వీడియోస్,ఎక్సపోసింగ్ ఫోటోలు, లైవ్ చాట్ వీడియోలు సోషల్ మీడియా నుండి తొలగించాలని పోలీసులకు రిక్వెస్ట్ చేసుకుంది.తాను హీరోయిన్ కావాలని వచ్చినప్పటికీ తను ఇప్పుడు ఒక విషయంపై ఉద్యమం చేస్తున్నాను కనుక తన గౌరవానికి తానే పోస్టు చేసిన కొన్ని వీడియోలు భంగం కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చింది.
కంప్లెయింట్ చదివిన పోలీసులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.ఇదేం కర్మరా బాబూ అనే ఫీలింగ్ లో పోలీసులు ఉన్నట్టు సమాచారం.
నాలుగు నెలల క్రితం బూతులు మాట్లాడుకుంటు యూ ట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది కూడా శ్రీరెెడ్డే. ఎక్సపోసింగ్ ఫొటోలతోపాటు… తాను వల్గర్ గా మాట్లాడిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో నుంచి డిలీట్ చేయాలని సైబర్ పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు కొందరు.పోలీసులకు ఎలా ఉన్నా ఇది వారి డ్యూటీ కనుక శ్రీరెడ్డికి ప్రొటెక్షన్ కల్పించే పనిలో పడ్డారు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS