వరుస చిత్రాలతో బిజీగా మారిన పూజా హెగ్డే

పూజా హెగ్డే ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస చిత్రాలతో గ్యాప్ లేనంత బిజీగా మారింది. అమెరికాలో ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్‌ పూర్తిఅయిందో లేదో వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే యాక్షన్ లవ్ స్టొరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రూపొందించిన రాయలసీమ సెట్లో షూటింగ్ జరుగుతోంది.45రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది.హారికా హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఈ నెల20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట. సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS