మారకుంటే కష్టం అంటున్న గులాబీ బాస్

ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలలో 39మంది డేంజర్ జోన్ లో వున్నారా? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. వీరితో పాటు ఇద్దరు మంత్రులు, విప్‌లు, పలు కార్పొరేషన్‌ చైర్మన్లు ఉన్నారట.నియోజకవర్గల్లో పరిస్థితి తెలిసి వారిని హెచ్చరించారు. కొంతమందితో కేసీఆరే స్వయంగా మాట్లాడారట. మిగిలిన వారికి దగ్గర ఉన్న మంత్రులతో చెప్పించారట. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదని కొంతమంది సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఇలానే ఉంటే కష్టం అని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS