మహేష్ బాబుకి అరుదైన గౌరవం దక్కింది

‘భరత్‌ అనే నేను’ సినిమా ఘన విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌బాబు సంబరం ఇప్పుడు రెట్టింపు అయ్యింది. లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌
మ్యూజియం సెలబ్రెటీల మైనపు విగ్రహాల ప్రదర్శనకు పెట్టింది పేరు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మహేశ్‌బాబు ట్విట్టర్ ద్వారా షేర్‌ చేశారు. ప్రతిష్టాత్మక మేడమ్‌ తుస్సాడ్స్‌లో భాగం కాబోతున్నందుకు సూపర్‌ హ్యాపీగా ఉందన్నారు.
ఇది వరకు టాలీవుడ్‌ హీరోలలో ప్రభాస్‌కు ఈ గౌరవం దక్కిన విషయం తెలిసిందే.ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుకు ఈ గౌరవం దక్కనుంది. ‘భరత్‌ అనే నేను’ సక్సెస్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.ఇప్పుడు ఈ విషయం తెలవడంతో వారి సంతోషానికి అవదులు లేకుండా పోయాయి.
ఇక మహేష్ బాబు తర్వాత చిత్రానికి వంశీ పైడిపల్లి
దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే
రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో భారీ విజయం సాధించిన దర్శకుడు సందీప్‌ వంగాతో కూడా ఓ సినిమా ఉండబోతోందని సమాచారం.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS