ఫెడరల్ ఫ్రంట్ లో మరో అడుగు

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్‌కు ఐటీ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్ళారు అఖిలేశ్‌.అక్కడ సీఎం కేసీఆర్‌తో సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు, దేశ రాజకీయ పరిణామాలపై చర్చించారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేసీఆర్ మమతాబెనర్జీ, దేవెగౌడ,కరుణానిధి, స్టాలిన్ వంటి నేతలను కలవడం జరిగింది. ఈ ఫ్రంట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేయాలని వీరిద్దరి మధ్య చర్చ జరినట్టుగా సమాచారం.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS