నాకే కథ తెలియదు: రామ్‌ చరణ్‌

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సింగ్‌ నేపద్యంలో ఉంటుందనే వార్తలు ఈ మధ్య  వినిపించాయి. కానీ ఇది బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కాదని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్ర విశేషాలు మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు నాకు, తారక్‌కి కథ పూర్తిగా చెప్పలేదని తెలిపారు. ‘మగధీర’ చిత్రం షూటింగ్ సమయంలో రాజమౌళితో వర్క్‌ చాలా ఎంజాయ్‌ చేశాను. మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా చేయాలనుకున్నాను.
అలాగానే స్టోరీ కూడా వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నా. సమ్మర్‌ కంప్లీట్‌ అయ్యేలోగా తారక్‌కి, నాకు పూర్తి కథ చెప్తానని రాజమౌళి అన్నారు. ఇందులో భాగంగా లాస్‌ ఏంజెల్స్‌లో టెస్ట్‌ షూట్‌కి వెళ్లాం. బహుశా అది గ్రాఫిక్స్ వర్క్‌కు సంబంధించింది అని అనుకుంటున్నాను. యూనివర్శల్‌ ఆడియన్స్‌ను
‘బాహుబలి’ సినిమాతో సంపాదించారు రాజమౌళి.మేము చేసే సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నాను.ప్రెసెంట్ బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ చేస్తోన్న సినిమా బ్యాంకాక్‌ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS