దేశంలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు… దేశంలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టినట్టు తెలిపింది. అభ్యర్థులు, పార్టీల పెట్టిన ఖర్చు 9వేల500 కోట్ల నుంచి 10వేల 500 కోట్ల మధ్య ఉండవచ్చని ఎస్టిమేట్ చేసింది. 2013 అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కన్నా… ఇది రెండురెట్ల ఎక్కువని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి, సభలకు అయిన ఖర్చును ఇందులో కలపలేదు. దీన్నిబట్టి చూస్తే 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల ఖర్చు దాదాపు 50వేల కోట్ల నుంచి 60వేల కోట్ల వరకూ ఉండొచ్చని CMS అంచనా వేసింది.

SHARE THIS NEWS WITH YOUR FRIENDS