కాంగ్రెస్ పై ధ్వజమెత్తిన యడ్యూరప్ప

కాంగ్రెస్‌ పార్టీని కన్నడ ప్రజలు తిరస్కరించారని బీజేపీ కర్ణాటక సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధారామయ్య రెండు చోట్ల పోటీ చేయగా చాముండేశ్వరిలో ఘోర పరాజయం చవిచూశారు.
ఫలితాలను చూస్తే అర్థమవుతుంది కన్నడ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌-జేడీఎస్‌లు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో యడ్యూరప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీకి మాత్రమే గవర్నమెంట్ ఏర్పాటు చేసే హక్కు ఉందని, గవర్నర్‌ ముందు అతి పెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. అయినా కాంగ్రెస్‌ మాత్రం అధికారం కోసం సిగ్గులేకుండా పాకులాడుతోందని ధ్వజమెత్తారు. అధికారంకోసం కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలు నీచంగా ఉన్నాయని పేర్కొన్నారు.
బీజేపీకి గొప్ప ఫలితాలను అందించిన కన్నడ ప్రజలకు సీఎం అభ్యర్థి యడ్యూరప్ప ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం పాటు పడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Rating: 4.0/5. From 1 vote.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS