ఆలస్యంగా వెలుగులోకొచ్చిన జువైనల్ హోమ్ ఘటన

హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి వారంరోజుల వ్యవధిలో 20 మంది పరారయ్యారు. సైదాబాద్ లోని హోమ్ నుంచి 12న రాత్రి ఒకేసారి 15 మంది పారిపోగా… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం హోమ్ నిర్వాహకులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన వారి కోసం వెతుకుతున్నారు. పారిపోతున్న సమయంలో ఓ టూవీలర్ ను కూడా దొంగిలించుకెళ్లారు. ఇది కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన బాల నేరస్తులు గోడదూకి పారిపోయారు. జువైనెల్ హోమ్ లో అబ్జర్వేషన్ లో ఉన్న బాల నేరస్తులు పక్కా ప్లాన్ తో పరారయ్యారు. పోతూపోతూ సైదాబాద్ హరిజన బస్తీలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను ఎత్తుకొళ్లారు. గత నాలుగు రోజుల క్రితం కూడా ఇదే హోమ్ నుంచి ఐదుగురు పరారయ్యారు. తప్పించుకున్న బాలలను పట్టుకునేందుకు జువైనెల్  ఉన్నతాధికారులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు సైదాబాద్ పోలీసులు.

 జువైనల్ హోమ్ నుంచి బాలలు తప్పించుకోవటంపై సీరియస్ గా రియాక్టయ్యారు ఉన్నతాధికారులు. బాలల పరారీపై నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు హోమ్ డైరెక్టర్. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సూపర్ వైజర్లను సస్పెండ్ చేశారు. జువైనల్ హోం నుంచి బాలలు పారిపోవటంపై.. సూపరింటెండెంట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. బాలల హక్కుల సంఘం నేతలు.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS