అస్వస్థతకు గురైన లాలూ, హాస్పిటల్ కి తరలింపు

మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్
శనివారం అస్వస్థతకు గురయ్యారు.సరిగ్గా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుండటంతో ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు.లాలూకు డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. కొన్ని అవినీతి కేసులలో శిక్ష అనుభవిస్తున్న లాలూ తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి కారణంగా మూడు రోజులు బెయిల్ పై వచ్చారు.
లాలూ అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని రాంచీ హైకోర్టు మే11న షరతులతో కూడిన ఆరు వారాల ప్రొవిజనల్ బెయిల్ ఇచ్చింది. మీడియా సమావేశంలో మాట్లాడటంపై నిషేధం విధించింది. అనుక్షణం వీడియో కవరేజ్ వుండేలా ఏర్పాటు చేసింది.

No votes yet.
Please wait...
SHARE THIS NEWS WITH YOUR FRIENDS